![CM Revanth Visited Speaker Gaddam Prasad And Tammineni - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/26/CM-Revanth.jpg.webp?itok=KSzuwIcX)
( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. స్పీకర్ గడ్డం ప్రసాద్, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వివరాల ప్రకారం.. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం, సీఎం రేవంత్.. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లారు. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి పరామర్శించారు. కాగా, ఇటీవలే స్పీకర్ ప్రసాద్ అనారోగ్యానికి గురయ్యారు.
మరోవైపు.. తమ్మినేని వీరభద్రాన్ని కూడా సీఎం రేవంత్ పరామర్శించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన సీఎం రేవంత్.. తమ్మినేనిని పరామర్శించారు. కాగా, తమ్మినేనికి ఇటీవల స్ట్రోక్ రావడంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో, ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment