ఖమ్మంలో అధికంగా 36.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు
వాతావరణ శాఖ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 36.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత హకీంపేట్‌లో 18.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. చాలాచోట్ల గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి.
ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సీయస్ అధికంగా నమోదు కాగా...ఆదిలాబాద్‌లో 2 డిగ్రీల సెల్సియస్, మిగతాచోట్ల ఒక డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఉంటుందని, తేమశాతం తగ్గడంతో ఉక్కపోత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment