సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతి కేసులో సస్పెన్షన్‌కు గురైన సీనియర్ విద్యార్థి ఎంఏ సైఫ్ అలీ వాదన వినాలని కాకతీయ మె డికల్ కాలేజీని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత అతనిపై సస్పెన్షన్ ఎత్తివేయాలా? వద్దా? అనేదానిపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
‘వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ధరావత్ ప్రీతి ఎండీ అనస్థీషియా విద్యార్ధినిగా 2022లో చేరింది. రెండో సంవత్సరం చదువుతున్న సైఫ్ ఆమెను ర్యాగింగ్ చేస్తూ వేధింపులకు గురిచేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 21న సైఫ్ తన స్నేహితులతో కలసి ప్రీతికి విషపూరిత ఇంజక్షన్ ఇచ్చారు. చికిత్స పొందుతూ ప్రీతి మృతి చెందింది. దీనికి కారకులైనవారిపై కఠినచర్యలు తీసుకోవాలి’అని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో భాగంగా సైఫ్‌ను అధికారులు అరెస్టు చే యడమే కాకుండా సస్పెండ్ చేశారు. అయితే తన వాదనలు కూడా వినకుండా సస్పెండ్ చేశారని సైఫ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సస్పెన్షన్ కొట్టివేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూరేపల్లి నందా విచారణ చేపట్టారు. సైఫ్ వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment