హుడా కాంప్లెక్స్: ‘అవసరమైనప్పుడు వేదం చదవాలి. గాండీవం కూడా ఎత్తాలి.. సమయం, సందర్భాన్ని బట్టి స్ఫూర్తిని అలవర్చుకోవాలి.. విజ్ఞతను ప్రదర్శించాలి’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బ్రాహ్మణులకు పిలుపునిచ్చారు. సరూర్‌నగర్ స్టేడియంలో ఆదివారం బ్రాహ్మణ రాష్ట్ర సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహించిన బ్రహ్మగర్జన సభలో ఆమె ముఖ్య అతి థిగా ప్రసంగించారు.
సింహాలు గర్జించాలని.. అప్పుడే అడ వి ఆర్డర్‌లో ఉంటుందని, మేఘాలు గర్జించాలని.. అప్పుడే సమాజం చల్లగా ఉంటుందని వ్యాఖ్యానించారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా బ్రాహ్మణు లకు ఒక్క రూపాయి ఇవ్వలేదనీ కానీ బీఎస్‌ఎస్ ప్రభుత్వం అర్చక స్వాములకుజీతాలు ఇస్తోందని, ఉద్యోగ భద్రత కల్పిస్తోందని, దూపదీప నైవేద్యాల సొమ్మును రూ.2,500 నుంచి రూ.10 వేలకు పెంచిందని ఆమె గుర్తు చేశారు.
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని 1,600పైగా ఆల యాలకు రూ.16,000 నుంచి రూ.ఐదు లక్షల వరకు ఇచ్చి న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ చదువుకోవాలనే వారికి స్టడీ సర్కిళ్లలో అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.
హేళన చేస్తే క్షమించం: బ్రాహ్మణులను చూసి హేళన చేసే వారిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం క్షమించదని కవిత స్పష్టం చేశా రు. బ్రాçహ్మణులు సైతం రాజకీయంగా రాణించాలని ఆకాంక్షించారు. బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ శర్మ అధ్యక్షతన జరిగిన సభలో సత్యానంద భారతీస్వామి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, టీఎస్‌ఐడీసీ చైర్మన్ వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ వాణిదేవి, ఎమ్మెల్యేలు సుధీర్‌రె డ్డి, శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, పురాణం సతీష్, దేవిప్రసాద్, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే ఎంవీఎస్‌ఎస్ ప్రభాకర్, బ్రాహ్మణ సంఘం కార్యదర్శి తుల సి శ్రీనివాస్, కోశాధికారి మునిపెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment