‘ఆ మేడం మాకొద్దు సార్‌’ | Telangana: Kasturba Gandhi Girls School Students Protest Over Teacher Rejoining | Sakshi
Sakshi News home page

‘ఆ మేడం మాకొద్దు సార్‌’

Published Thu, Apr 28 2022 10:15 PM | Last Updated on Fri, Apr 29 2022 9:59 AM

 Telangana: Kasturba Gandhi Girls School Students Protest Over Teacher Rejoining - Sakshi

భీమిని: ఈ ఎస్‌వో మేడమ్‌ ఉంటే తాము ఉండబో మంటూ కన్నెపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు బుధవారం భవనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. 15రోజుల క్రితం సస్పెండ్‌ అ యిన ఎస్‌వో(ప్రత్యేక అధికారి) అమూల్య జిల్లా వి ద్యాశాఖ అధికారి ఆదేశాలతో తిరిగి విధుల్లో చేరడానికి వచ్చారు. విద్యార్థుల గదుల్లోకి వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో విద్యార్థులు భవనం పైకి ఎక్కి ఆందోళన చేపట్టారు.

ఉపాధ్యాయులు, సిబ్బంది న చ్చజెప్పినా వినలేదు. కన్నెపల్లి తహసీల్దార్‌ రాంచందర్‌ అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి కిందికి రప్పించారు. మేడమ్‌ విధుల్లో చేరితే తాము చదువుకోలేమని, గతంలో మీ రిజల్ట్‌ ఎలా వస్తుందో చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, విద్యార్థుల ఆందోళనతో ఈ నెల 12న ఎస్‌వో సస్పెండైన విషయం తెలిసిందే. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే విధుల్లో చేరికకు అనుమతి ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement