సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు వాయిదా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్‌సీ స్పందిస్తూ.. పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు లేదని అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చింది.
కాగా.. గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల వాయిదా ప్రచారాన్ని టీజీపీఎస్‌సీ ఖండించింది. పరీక్షల తేదీల మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టిపారేసింది. ఈ వార్తలను అభ్యర్థులను పట్టించుకోవద్దని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలను గతంలోనే గుర్తించగా.. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. గతకొద్ది రోజులుగా మరోమారు పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు. మరోవైపు పోస్టుల సంఖ్య పెంచాలంటూ నిరుద్యోగులు పోరుబాట పట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రూప్-2 పోస్టులను 2000లకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment