
సాక్షి, హైదరాబాద్: ప్రజా స్వీయ విజ్ఞప్తుల ద్వారా వాళ్ల సమస్యల పరిష్కారం కోసమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా భారీగా స్పందన లభిస్తోంది. చలిని సైతం లెక్కచేయకుండా రాత్రంతా అక్కడే ఉంటున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రజావాణి ఉదయం 4.30 నుంచే కార్యక్రమం మొదలు కావడం గమనార్హం.
జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ వద్ద ప్రజావాణికి ఫిర్యాదులతో వచ్చిన వాళ్లను క్యూ లైన్‌లో ఎక్కువ సేపు ఉంచడం లేదు. వాళ్లు ఇబ్బంది పడడమే కాకుండా.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వచ్చినవారిని వచ్చినట్లే క్యూ ద్వారా లోపలికి పంపిస్తున్నారు అధికారులు. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కొనసాగుతోంది. ప్రజావాణిలో.. ఉద్యోగుల బదిలీలు, పెన్షన్లు విజ్ఞప్తులతోపాటు భూకబ్జాలు, డబుల్ బెడ్రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment