తిరుపతి: రాపూరు–పెంచలకోన జాతీయ రహదారిలో సోమవారం అర్ధరాత్రి కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. ఐదుగురికి తీవ్రగాయాలైన ఘటన నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, ఓబులాయిపల్లి గ్రామ సమీపాన చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. నిజామాబాద్‌కు చెందిన కుటుంబ సభ్యులు కారులో కంచికి వెళ్లి పెళ్లిబట్టలు కొనుగోలు చేశారు.
ఆపై తిరుగుప్రయాణంలో ఓబులాయిపల్లె సమీపంలో కారుకు అడ్డంగా కుక్క అడ్డురావడంతో దాన్ని తప్పించబోయి అదుపు తప్పి పక్కనున్న గోతిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కొల్లూరు భూలక్ష్మి (43) అక్కడికక్కడే మృతి చెందగా.. పెళ్లి కూతురు తల్లి కందూరు రవణమ్మ, పెళ్లికూతురు రవళి, అన్న సునీల్‌కుమార్, బంధువు రాజ్యలక్ష్మి, కొల్లూరు మహిమచౌదరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment