వృద్ధుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

వృద్ధుడి ఆత్మహత్య

Published Sat, May 25 2024 1:11 AM

వృద్ధ

దొరవారిసత్రం : మండలంలోని ఉచ్చూరు పంచాయతీ ఆర్మేనికండ్రిగ ఎస్సీకాలనీకి చెందిన మొద్దూరు రాఘవయ్య(74) అనే వృద్ధుడి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. రాఘవయ్య మద్యానికి బానిసగా మారి నిత్యం డబ్బుల కోసం కనిపించిన ప్రతి ఒక్కరినీ వేధించేవాడు. ఆ రోజు తాగేందుకు ఎవరూ డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగేశాడు. స్థానికులు గుర్తించి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రాత్రి మరణించాడు. రాఘవయ్య మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. ఎస్‌ఐ తిరుమలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమలలో కార్డెన్‌ సెర్చ్‌

తిరుమల : తిరుమలలో పోలీసులు గురువారం రాత్రి కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. టూటౌన్‌ సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో బాలాజీ నగర్‌లోని ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

వృద్ధుడి ఆత్మహత్య
1/1

వృద్ధుడి ఆత్మహత్య

Advertisement
 
Advertisement
 
Advertisement