ఏడు నెలల్లో జరిగిన అరాచకాలు కొన్ని | - | Sakshi
Sakshi News home page

ఏడు నెలల్లో జరిగిన అరాచకాలు కొన్ని

Published Sat, Feb 1 2025 12:32 AM | Last Updated on Sat, Feb 1 2025 12:33 AM

ఏడు న

ఏడు నెలల్లో జరిగిన అరాచకాలు కొన్ని

● వెంకటగిరి పట్టణంలోని 7వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడు తంగా పేచీరాజ్‌ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తుంటారు. కూటమి నేతలు అతనిపై పగపట్టి కక్షసాధింపు చర్యలకు పూనుకున్నారు. పేచీరాజ్‌పై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు తెల్లవారుజామున పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అక్రమంగా గంజాయి కేసు బనాయించి జైలుపాలు చేశారు.

● పార్టీ పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆఽధ్వర్యంలో పోలీసు అనుమతులతో వెంకటగిరి పట్టణంలో శాంతియుతంగా విద్యుత్‌ పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో కూటమి నేతకు చెందిన ఓ చోటా నాయకుడు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సాక్షాతు పోలీసులే ఈ ఘటన చూసి ఆ చోటా నేతను పక్కకి తీసుకెళ్లి సర్దిచెప్పారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధి సహకారంతో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డితోపాటు మరో 11 మందిపై తప్పుడు కేసులు నమోదు చేశారు.

● రోడ్డు విస్తరణలో భాగంగా పట్టణంలోని 9వ వార్డులో ప్రజలకు కనీస సమాచారం, నోటీలు జారీ చేయకుండా వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులైన ఇళ్లను మున్సిపల్‌, రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఈ బాధను భరించలేక బాధితుడు చిల్లకూరు శివరామిరెడ్డి మృతి చెందారు.

● సైదాపురం మండలం, చాగణం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియ కార్యకర్త చిరంజీవిపై సైదాపురం పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు.

● బాలాయపల్లి మండలం, మన్నూరు గ్రామానికి చెందిన కాటూరు రామతులసికి సంబంధించిన వ్యవసాయ భూమిని అధికార పార్టీ అనుకూల వ్యక్తులు కొందరు ఆక్రమించారు. దీనిపై ప్రశ్నించినందుకు రామతులసి, ఆమె అనుచరులపై దాడికి పాల్పడ్డారు. ఆపై బాలాయపల్లి పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు చేయించారు.

● సైదాపురం పంచాయతీ, కమ్మవారిపల్లి గిరిజన కాలనీకి చెందిన కొందరు గిరిజనులు ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్నారు. కూటమి నేత వారిపై ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు గిరిజనులపై తప్పుడు కేసును బనాయించారు.

● రాపూరు మండలం వైఎస్సార్‌సీపీ నేత పాపకన్ను మధుసూదన్‌రెడ్డికి సంబంధించిన వ్యవసాయ భూములు స్వాధీనం చేసుకునేందుకు కూటమి నేతలు కుట్ర పన్నారు. ఆ నేతకు చెందిన సాగు భూమికి వేసిన కంచెను తొలగించి బీభత్సం సృష్టించారు.

● డక్కిలి మండలంలోని డి ఉప్పరపల్లిగొల్లపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత బొల్లినేని భాస్కర్‌నాయుడు జనవరి 28వ తేదీన స్వగ్రామానికి రావడంతో పథకం ప్రకారం కూటమి నేతలు అతనిపై తప్పుడు కేసులు బనాయించారు.

ఎవ్వరినీ వదలం

నియోజకవర్గ ప్రజలపై తప్పుడు కేసులు పెట్టిన ఎవరీ వదలబోం. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అక్రమాలు, అన్యాయాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు బెదిరే సమస్యే లేదు. త్వరలోనే కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేరోజు దగ్గరలోనే ఉంది. ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాల్సిన రెవెన్యూ, పోలీసు అధికారులు పేద ప్రజలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. కేసులకు భయపడేవాడిని కాదు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదు.

– నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, వెంకటగిరి నియోజకవర్గం

No comments yet. Be the first to comment!
Add a comment
ఏడు నెలల్లో జరిగిన అరాచకాలు కొన్ని 1
1/1

ఏడు నెలల్లో జరిగిన అరాచకాలు కొన్ని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement