వెంకటగిరిలో కూటమి దౌర్జన్యకాండ
● చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న కూటమి నేతలు ● ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ● అమాయకులపై అక్రమ కేసులు ● రాజ్యమేలుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం
సాక్షి,టాస్క్‌ఫోర్స్: వెంకటగిరి నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. అమాకులనే టార్గెట్‌గా చేసుకుని చెలగాటమాడుతోంది. పేదలపై అక్రమ కేసుల నుంచి ఇళ్లు కూల్చివేత వరకు అరాచకం.. దౌర్జన్యం చెలరేగుతోంది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి, రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెలదీస్తున్నారు. కనీసం పోలీసు స్టేషన్ గడప తొక్కాలన్నా హడిలిపోతున్నారు. ఇక రెవెన్యూ శాఖ ఏకపక్షంగానే వ్యవహరిస్తుండడం గమనర్హం. కేవలం వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులతోపాటు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసుకుని కూటమి నేతలు మరింత రెచ్చిపోతున్నారు. సామాన్యుడి నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి వరకు కేసులు నమోదు చేసి ముప్పుతిప్పలు పెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment