పారిశ్రామికవేత్తలుగా ‘రాణి’ంచాలి
నాయుడుపేట టౌన్ : మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలని డీర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టీఎన్ శోభన్‌బాబు పిలుపునిచ్చారు. నాయుడుపేట సంఘమిత్ర కార్యాలయంలో శుక్రవారం నాయుడుపేట, గూడూరు, శ్రీకాళహస్తి కస్టర్‌లలోని మండలాలకు సంబంధించి పీఎం ఎఫ్‌ఎంఈ, ఈజీపీ కేవీఐసీలకు కొత్తగా రుణాల కోసం నమోదు చేసుకున్నా ఔత్సాహిక వేత్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పీడీ ప్రత్యేక అఽతిథిగా పాల్గొని మాట్లాడారు. ఔత్సాహిక వేత్తలకు కేవీఐసీ ద్వారా అందించే సేవల గురించి వివరించారు. మహిళలు తయారు చేస్తున్న ఫుడ్ ప్రాడక్టు, జూట్ బ్యాగుల తయారీ, నిల్వ పచ్చళ్లు, అప్పడాల తయారీ తదితరాల వాటిలో మేలకులపై కేవీఐసీ ఏడీ కోటిరెడ్డి శిక్షణ ఇచ్చారు. ఇంకా డైరెక్టర్ శ్యాముల్ గ్రిప్, ఎల్‌డీఎం విశ్వనాఽథ్‌రెడ్డి, ఏడీ వెంకట్‌రామ్ రెడ్డి, జిల్లా జీవనోపాధులు అధికారి టీ.ధనుంజయరెడ్డి మాట్లాడారు. నాయుడుపేట ఏపీఎం ఉమాదేవి, సీసీలు, మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
ఎస్వీయూలో చిరుత హల్‌చల్
తిరుపతి సిటీ: ఎస్వీయూ ప్రాంగణంలో గురువారం రాత్రి చిరుత హల్‌చల్ చేసింది. వర్సిటీలోని ఐ బ్లాక్ మెన్స్ హాస్టల్ సమీపంలోని చెట్లపొదల్లో జింకను వేటాడి సంహరించింది. దీంతో వర్సిటీ అధికారులు విద్యార్థులను, ఉద్యోగులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే అటవీశాఖ అధికారులు వర్సిటీ ప్రాంగణంలో చిరుత సంచరిస్తున్న ప్రాంతాలను పసిగట్టి సీసీ కెమెరాలను అమర్చారు. కానీ బోన్లను అమర్చి చిరుతను బంధించడంలో విఫలమయ్యారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వర్సిటీలలో బోన్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
బీఈడీ ఫస్ట్ సెమ్ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలో గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన బీఈడీ మొదటి సెమిస్టర్ ఫలితాలను శుక్రవారం విడుదల చేసిసట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎం దామ్లానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.
3న స్విమ్స్‌లో డ్రైవర్ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ
తిరుపతి తుడా : స్విమ్స్ ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన డ్రైవర్ పోస్టుల భర్తీకి ఈనెల 3న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు పోస్టులు ఉన్నాయని, ఒకటి ఓసీకి, మరొకటి బీసీ ఏకి కేటాయించినట్లు వెల్లడించారు. అర్హత, జీతభత్యాలు, దరఖాస్తుల కోసం స్విమ్స్ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment