
ముగిసిన దివ్యాంగ క్రికెట్ సెలెక్షన్స్
తిరుపతి సిటీ: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫెరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ, డిఫెరెంట్లీ ఎబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ వేదికగా జరిగిన దివ్యాంగ క్రికెట్ సెలెక్షన్స్ ముగిసినట్టు ఆ సంఘ చైర్మన్ సూర్యనారాయణ, కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 20 మంది దివ్యాంగులు ఈ సెలెక్షన్స్‌లో పాల్గొన్నారని తెలిపారు. ఎంపికలో ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ సంఘ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసం వెంకట దుర్గారావు, ఉమ్మడి చిత్తూరు జిల్లా దివ్యాంగుల క్రికెట్ సంఘ జాయింట్ సెక్రటరీ తలారి మోహనబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పురుషోత్తం రెడ్డి, సభ్యులు నరేష్, తులసికృష్ణా, కోచ్ మహాలింగం శ్రీనివాసులు పాల్గొన్నారు.