
శాస్త్రోక్తంగా పెద్దకొట్టాయి ఉత్సవం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం శాస్త్రోక్తంగా పెద్దకొట్టాయి ఉత్సవం జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు పలు రకాల అభిషేక పూజలు నిర్వహించారు. స్వామి,అమ్మవార్లకు నైవేద్యం, మంత్రపుష్పం, దీపారాధన, హారతులు సమర్పించారు. ఈవో బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పందుల దాడిలో
పంటలు ధ్వంసం
బుచ్చినాయుడుకండ్రిగ : మండలంలోని కాంపాళెం, కరకంబట్టు, కుక్కంబాకం, బుచ్చినాయుడుకండ్రిగ, గ్రామాల్లో పంటలను అడవి పందులు శనివారం రాత్రి ధ్వంసం చేశాయి. చేతికొచ్చే దశంలో పంట నష్టపోవడంతపై బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ అడవి పందులు దాడికి దిగుతుండడంపై ఆందోళన చెందుతున్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో సుమారు 565 ఎకరాలు సాగులో ఉన్నాయి. వీటిని అడవి పందులు ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండడంపై రైతులు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అడవి పందులను కట్టడి చేయకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు. పంటల రక్షణకు సోలార్‌ఫెన్సింగ్‌ను రాయితీపై అందించాలని విన్నవిస్తున్నారు.
ఫిజియోథెరపీపై శిక్షణ
తిరుపతి కల్చరల్: నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్డులో ఉన్న రాస్ కార్యాలయంలో ఫిజియోథెరపీ విభాగానికి చెందిన డాక్టర్ రేవతి, డాక్టర్ చరణ్ ఆధ్వర్యంలో ఆదివారం ఫిజియోథెరపిస్టులకు, విద్యార్థులకు ఆటిజంపై అమెరికన్ అడ్వాన్డ్‌స్ ఫిజియోథెరపీ మెళకువలపై శిక్షణలో భా గంగా తెలిపారు. ఇందులో ఆటిజంపై ఉన్న పిల్ల ల తల్లిదండ్రులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఆటిజంతో ఉన్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల చికిత్స కోసం ఫిజి యోథెరపీ సెంటర్‌ను, లేదా 9290234075ను సంప్రదించాలని వారు తెలియజేశారు.