దళారుల ప్రమేయం లేకుండా పథకాలు
తాండూరు రూరల్: దళారుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిధి చెన్‌గేస్‌పూర్ గ్రామంలో నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల ఎంపిక నిరంతర ప్రక్రియన్నారు. పథకాలు అందని వారు మరోసారి దరఖాస్తు చేసుకుంటే, పది రోజుల్లో అధికారులు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. చెన్‌గేస్‌పూర్‌లో 62 మందికి కొత్త రేషన్‌కార్డులు, 66 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 201 ఇందిరమ్మ ఇళ్లు, 280 మందికి రైతుభరోసాను అందజేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు ఉత్తమ్ చందు, నాగప్ప, శ్రీశైలంగౌడ్, వెంకటేశం, రాజుగౌడ్, కుర్వ మల్లప్పలు ఉన్నారు.
అర్హులందరికీ..
యాలాల: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. మండల పరిధి తిమ్మాయిపల్లిలో కొత్త పథకాల లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, సొసైటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, పార్టీ బీ బ్లాక్ అధ్యక్షుడు అనిల్‌కుమార్, మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం ముదిరాజ్, మాజీ ఎంపీపీ పురుషోత్తంరావు తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment