ఎర్ర జెండా అంటేనే భరోసా
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
చేవెళ్ల: ఎర్ర జెండాను చూస్తే నిరుపేదలు గుండెకు హత్తుకుంటారని, భూస్వాములు, దోపిడీదారులు భయపడతారని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్‌లో మంగళవారం నియోజకవర్గ కార్యదర్శి కె.రామస్వామి అధ్యక్షతన పార్టీ నియోజకవర్గ స్థాయి జనరల్‌బాడీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సాంబశివరావు మాట్లాడుతూ.. దేశ గడ్డపై 99 ఏళ్లు పూర్తి చేసుకొని శంత వసంతంలోకి అడుగుపెడుతున్న ఏకై క పార్టీ జెండా సీపీఐ అని పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు అధికా రం లేకపోయినా, పదవులు లేకపోయిన, ఆర్థి క ఇబ్బందులు ఎదురైనా ప్రజల కోసం ప్రా ణ త్యాగాలు చేసిన గొప్ప సిద్ధాంతం కమ్యూనిజం అని తెలిపారు. దోపిడీ కోటలను కూల్చి పేదల రాజ్యాన్ని నిర్మించిన చరిత్ర ఈ పార్టీకి ఉందన్నారు. భూమికోసం భూక్తికోసం పేదల విముక్తికోసం నిజాం రాజుకు వ్యతిరేకంగా, బ్రిటిష్ సామ్రాజ్యావాదులకు వ్యతిరేకంగా నిలిచి పోరాడిందని, ఏనాడు ప్రభుత్వాల కు రాజీ పడలేదన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ.రవీంద్రచారి, రాష్ట్ర సమితి సభ్యులు పి.పర్వతాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment