అక్రమ రవాణాపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Published Wed, Jan 29 2025 7:56 AM | Last Updated on Wed, Jan 29 2025 7:56 AM

అక్రమ

అక్రమ రవాణాపై ఉక్కుపాదం

● ఎస్పీ నారాయణరెడ్డి

అనంతగిరి: జిల్లాలో ఇసుక, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ల వారీగా నమోదైన కేసులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌ కేసులను వెంటనే పూర్తి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకొని వాటి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా కళాజాత బృందాలతో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇసుక, గుట్కా, పీడీఎస్‌ రైస్‌ అక్రమ రవాణాను అరికట్టాలని అధికారులకు సూచించారు. నేరస్థులను పట్టుకోవడంలో సీసీ టీవీల పాత్ర ఎంతో ఉంటుందని వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వీకెండ్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, వాహనాల తనిఖీ చేపట్టాలని తెలిపారు. మహిళలు, యువతులను వేధించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నేర చరిత్ర ఆధారంగా రౌడీ షీట్‌, పీడీ యాక్ట్‌ నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో వికారాబాద్‌, పరిగి, తాండూరు డీఎస్‌పీలు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌, బాలకృష్ణారెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్‌పీ జానయ్య, ఇన్‌స్పెక్టర్లు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అక్రమ రవాణాపై ఉక్కుపాదం1
1/1

అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement