‘చుక్’చకా..
షాద్‌నగర్: రైల్వే దశను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమృత్ భారత్ పథకం కింద స్టేషన్ల రూపురేఖలు మార్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఆధునికీకరణతో పాటు ప్రయాణికులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో 15 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. అందులో షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసి అభివృద్ధికి రూ.9.59 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
అత్యాధునిక సదుపాయాలు
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. స్టేషన్ ముందు ఉన్న స్థలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. స్టేషన్లో వీఐపీ లాంచ్, లిప్టులు, టైల్స్, షెడ్స్, మరుగుదొడ్లు, మహిళలకు ప్రత్యేక గెస్టు హౌస్, పార్కింగ్ గార్డెన్లను నిర్మిస్తున్నారు. స్టేషన్ ఆవరణలో అత్యాధునిక అనౌన్స్మెంట్ సిస్టం, విద్యుత్ బోర్డులు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే పెయింటింగ్స్, ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, అత్యాధునిక ముఖ ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు.
వడివడిగా పనులు
రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ఏడాది క్రితం ప్రధాని మోదీ అభివృద్ధి పనులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ప్రస్తుతం స్టేషన్ ఆవరణలోని స్థలాన్ని సుందరంగా మార్చుతున్నారు. ఆర్చ్, పార్కింగ్ గార్డెన్ పనులు చకచకా సాగుతున్నాయి. అదేవిధంగా భారీ ఐరన్ చానల్స్‌తో నిర్మాణ పనులు కొనసాగుతన్నాయి.
షాద్‌నగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ
అమృత్ భారత్ పథకం కింద ఎంపిక
రూ.9.59 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
చురుగ్గా సాగుతున్న పనులు
Comments
Please login to add a commentAdd a comment