అభివృద్ధికి అడిగినన్ని నిధులు
● స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
బంట్వారం: అభివృద్ధి పనులకు అడిగినన్ని నిధులు మంజూరు చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించి కొత్త వాటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు. అర్హులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూమి లేని నిరుపేద రైతులకు ఏడాదికి రూ.12 వేల చొప్పన ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. సాగుకు మోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా సాయం అందుతుందని స్పష్టం చేశారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు మంజూరు చేస్తామన్నారు. రేషన్‌కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. పథకాలు అందని వారు ఆందోళన చెందాల్సిన అవస రం లేదన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కులు అందజేశారు. అంతకుముందు కోట్‌పల్లిలో చెక్కుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేశం, మర్పల్లి మా ర్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, తహసీల్దార్లు విజయ్‌కుమార్, శ్రీనివాస్, ఎంపీడీఓలు రాములు, డానియల్, నాయకులు పురుషోత్తంరెడ్డి, మొగుల య్య, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment