కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌.. బొమ్మాబొరుసు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌.. బొమ్మాబొరుసు

Published Thu, Jan 30 2025 7:28 AM | Last Updated on Thu, Jan 30 2025 7:28 AM

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌.. బొమ్మాబొరుసు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌.. బొమ్మాబొరుసు

చేవెళ్ల: కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం బీఆర్‌ఎస్‌ మాదిరిగానే హామీల అమలులో విఫలమైందని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. మండల కేంద్రంలోని షాబాద్‌ చౌరస్తాలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో జెండా పండుగతో బీజేపీ ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉంటామని చాటి చెబుతున్నామన్నారు. పదేళ్ల మోదీ పాలనలో సంక్షేమ పథకాలు ప్రారంభించారని.. దళారీ వ్యవస్థ లేకుండా రూ.25లక్షల కోట్ల ఆదాయం పేదలు, రైతుల అకౌంట్లలో జమచేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని మండిపడ్డారు. మాటలతో పబ్బం గడుపుతున్నాడన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌ రాబోతుందన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని.. బీజేపీ పాలనలో రైతులకు, యువతకు, ప్రజలకు ప్రణాళిక ప్రకారం ఏమి చేయాలో ఆలోచించి ముందుకు వెళ్తామన్నారు. ఈ జెండా కార్యక్రమాలతో ప్రజలకు బీజేపీ ఉందనే భరోసాను కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లి బీజేపీ చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను తెలపడంతో పాటు ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానాలు చెబుతామన్నారు.

ఏడు స్థానాల్లో గెలుస్తాం: ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ చిత్తశుద్ధితో పనిచేసే పార్టీ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ హామీని నెరవేరుస్తూ దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తోందన్నారు. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను కై వసం చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్‌రెడ్డి, కేఎస్‌.రత్నం, రాష్ట్ర నాయకుడు కంజర్ల ప్రకాశ్‌, బీజేవైఎకం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్‌, పార్టీ మండల అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, యువ నాయకుడు డాక్టర్‌ వైభవ్‌రెడ్డి పాల్గొన్నారు.

హామీల అమలులో రెండు పార్టీలు విఫలం

రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement