ఇబ్రహీంపట్నం: ‘ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకే దక్కాలి.. వీటిని పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు’అని ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఏడు పథకాలపై వివిధ శాఖల అధికారులతో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకాల లబ్ధిదారుల ఎంపికతోపాటు సక్రమంగా అమలు చేసే బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, ఈజీఎస్, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఆయా పథకాల అర్హుల జాబితాను రూ పొందించడం సులువుగా మారుతుందన్నారు. సమావేశంలో ఆర్డీఓ అనంతరెడ్డి, ఇబ్రహీంపట్నం స్పెషలాఫీసర్ నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment