ప్రజల్ని మభ్యపెట్టేందుకే ‘గ్యారంటీలు’ | - | Sakshi
Sakshi News home page

ప్రజల్ని మభ్యపెట్టేందుకే ‘గ్యారంటీలు’

Published Thu, Jan 30 2025 7:28 AM | Last Updated on Thu, Jan 30 2025 7:28 AM

ప్రజల్ని మభ్యపెట్టేందుకే ‘గ్యారంటీలు’

ప్రజల్ని మభ్యపెట్టేందుకే ‘గ్యారంటీలు’

బొంరాస్‌పేట: రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్యారంటీ లేని పథకాలను ప్రచారం చేసుకుంటోందని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసిన అనంతరం మెట్లకుంట చెక్‌పోస్టు వద్ద విలేకరులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఇప్పటికై నా అర్హులకు పథకాలు అందేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల నియోజకవర్గంలోని చంద్రవంచ సభలో సీఎం హామీ ఇచ్చి మాట మార్చిన తీరు తన వైఖరి ఏమిటో అందరికీ తెలిసిపోయిందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై ప్రజలు తిరగబడటం ఖాయమన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్పా చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన హామీన్నీ వెంటనే నెరవేర్చాలన్నారు. విద్యార్థులకు స్కూటీలు, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, మహాలక్ష్మి, నిరుద్యోగులకు, దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మహేందర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, యాదగిరి, శేరి నారాయణరెడ్డి, దేశ్యానాయక్‌, నెహ్రూనాయక్‌, హీర్యానాయక్‌, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement