సంక్షేమ సంబురం
ఆమనగల్లు: ప్రభుత్వం జనవరి 26 ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలను మండలానికి ఓ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అర్హులకు అందజేస్తున్నారు. మండల పరిధిలోని పోలెపల్లిలో 122 మందికి ఇందిరమ్మ ఇళ్లు, 160 మందికి రేషన్‌కార్డులు, 11 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 1,157 మందికి రైతు భరోసా అందజేశారు. పోలెపల్లి గేటు నుంచి మంగళికుంట తండాకు వరకు రోడ్డు మరమ్మతుకు రూ.కోటి మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టపాసులు కాల్చి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బలరాం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి అభినవ్‌రెడ్డి, నాయకులు అంజన్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, బుచ్చిరెడ్డి, జంగయ్య, శేఖర్, శ్రీశైలం, కొండల్, జగన్, రవి, జంగయ్య, ఈదమయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment