
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖకు రానున్నారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో ప్రారంభం కానున్న జీ–20 సదస్సుకు హాజరుకానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సాయంత్రం 5.15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రుషికొండలో గల రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకుంటారు.
రాత్రి 7 నుంచి 8 గంటల వరకు జి–20 సదస్సుకు వచ్చే 20 దేశాల ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. అనంతరం జరిగే ‘గాలా డిన్నర్’లో పాల్గొని విదేశీ అతిథులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సదస్సునుద్దేశించి సీఎం మాట్లాడనున్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు రుషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్స్ నుంచి బయలు దేరి 8.35 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి విమానంలో గన్నవరం వెళ్తారు.