బిందెలతో జెడ్సీ కార్యాలయం ముట్టడి
కంచరపాలెం: మహిళలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. జీవీఎంసీ 45వ వార్డు తాటిచెట్లపాలెం పరిధిలోని ఏఎస్ఆర్ నగర్ జేఎన్ఎన్ఆర్యూఎం కాలనీకి చెందిన 280 కుటుంబాలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో చిట్టిబాబు కాలనీకి చెందిన మహిళలు, ఎస్టీ, ఎస్సీ, బీసీల సంక్షేమ సేవా సంఘం నేతృత్వంలో జ్ఞానాపురం జోన్–5 కార్యాలయాన్ని బిందెలతో ముట్టడించారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో నిరసన వ్యక్తం చేశామని సంఘం అధ్యక్షుడు గౌరీష్ తెలిపారు. ఇదిలావుండగా జోన్–5 కార్యాలయ అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు ఐదో పట్టణ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారిని నెట్టుకుంటూ జెడ్సీ చాంబర్లోకి దూసుకుపోయారు. సమస్య పరిష్కరిస్తానని జోనల్ కమిషనర్ బి.రాము హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment