విమ్స్‌లో సీబీఆర్‌ఎన్‌ సెంటర్‌కు అనుమతులు | - | Sakshi
Sakshi News home page

విమ్స్‌లో సీబీఆర్‌ఎన్‌ సెంటర్‌కు అనుమతులు

Published Tue, Nov 26 2024 1:27 AM | Last Updated on Tue, Nov 26 2024 1:27 AM

విమ్స్‌లో సీబీఆర్‌ఎన్‌ సెంటర్‌కు అనుమతులు

విమ్స్‌లో సీబీఆర్‌ఎన్‌ సెంటర్‌కు అనుమతులు

ఆరిలోవ: విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో సెకండరీ లెవెల్‌ కెమికల్‌ బైలాజికల్‌ రేడియాలజికల్‌ న్యూక్లియర్‌ (సీబీఆర్‌ఎన్‌) మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసినట్లు విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒప్పందం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి.కృష్ణబాబు జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారన్నారు. ఈ కేంద్ర ఏర్పాటు కోసం విమ్స్‌ ఆవరణలో 1.8 ఎకరాల స్థలం కేటాయించామన్నారు. ఈ స్థలంలో మూడు అంతస్తుల భవన నిర్మాణం చేపడతారన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు మెరుగైన వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. ఇంతవరకు అలాంటి బాధితులను కార్పొరేట్‌ ఆస్పత్రులకు తరలిస్తున్నారన్నారు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే విమ్స్‌లోనే వాటికి సంబంధించిన సేవలు అందుతాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement