● మరో మ్యాచ్‌లో పుదుచ్చేరి గెలుపు
విశాఖ స్పోర్ట్స్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ డీలో పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో అసోంపై విదర్భ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. విదర్భ ఓపెనర్ కరణ్ 47 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 75 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో టాస్ గెలిచి విదర్భ ఫీల్డింగ్ ఎంచుకుంది. అసోం నిర్ణీత 20 ఓవర్లలో మరో ఐదు బంతులుండగానే 123 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ దినేష్ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. ప్రతిగా విదర్భ రెండే వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్నందుకుంది. డేనైట్‌గా జరిగిన మరో మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో ఇన్నింగ్స్‌ను ఆరు ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి నిర్దేశించిన ఆరు ఓవర్లలో రెండు వికెట్లకు 91 పరుగులు చేసింది. ప్రతిగా ఒడిశా మూడు వికెట్లు కోల్పోయి 75 పరుగులే చేసింది. దీంతో 16 పరుగుల తేడాతో ఒడిశాపై పుదుచ్చేరి విజయం సాధించింది.
విశాఖ విద్య: సంస్థలు–పరిశ్రమల సమన్వయంతో అభివృద్ధి సాధ్యమని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ) డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన్ అన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో శుక్రవారం ఇండస్ట్రీ–అకాడెమియా సమ్మేళనం 2024 జరిగింది. ఇంధన రంగంలోని పురోగతి, సవాళ్లపై విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు ఈ సదస్సులో చర్చించారు. ఈ సందర్భంగా ఐఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన్ మాట్లాడుతూ విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సన్నిహిత సహకారం ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరచడం, వారికి ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐఐపీఈ డీన్ ప్రొఫెసర్ విజయ్ కుమార్, వివిధ సంస్థల ప్రతినిధులు కనుపర్తి నాగరాజా(హెచ్‌పీసీఎల్), డాక్టర్ సెంథిల్ మురుగన్ బాలసుబ్రమణ్యన్(రిలయన్స్), డా.మురళీకష్ణ కలగ(జీఈ వెర్నోవా), డా.కృష్ణకాంత్, డా.హేమంత్ తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment