ఆరిలోవ: విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) కొద్ది రోజులుగా జ్వర బాధితులతో కిటకిటలాడుతోంది. ఇక్కడ నమోదవుతున్న ఓపీలో సగానికి పైగా జ్వరాలతో బాధపడుతున్నవారే ఉన్నారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ ఇక్కడ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా ఇక్కడ ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఈఎన్‌టీ, ఫిజయోథెరపీ తదితర సమస్యలకు సంబంధించిన వారి ఓపీ ఎక్కువగా ఉంటుంది. కొద్ది రోజులుగా వాటి సంఖ్య కంటే జ్వరాలతో బాధపడుతున్న వారే సంఖ్య ఎక్కువగా ఉంది. శుక్రవారం విమ్స్‌కు వివిధ సమస్యలతో వచ్చిన వారు 655 మంది ఉండగా..అందులో జ్వరాలతో బాధపడుతున్న వారు 342 మంది ఓపీలో నమోదయ్యారు. కొద్ది రోజులుగా జ్వర పీడితుల సంఖ్యలో పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు చేసి, మందులు అందిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment