రాత్రి పూట నిఘా పటిష్టం
విశాఖ సిటీ: నగరంలో క్రైం రేటు తగ్గుముఖం పట్టేలా రాత్రి పూట నిఘా మరింత పటిష్టం చేయాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అధికారులను ఆదేశించారు. పోలీస్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏడీసీపీల నుంచి ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులతో నేర సమీక్ష చేశారు. ఎజైల్ యాప్‌ను అందరూ ఉపయోగించాలని చెప్పారు. ట్రాఫిక్ ఈ–చలనాలను కొత్తగా రూపొందించిన NextGen mParivahan యాప్ ద్వారా చెల్లించే విధానంపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పలు న్యాయ సంబంధిత అంశాలపై చర్చించారు. నగరంలో యాక్టివ్‌గా ఉన్న రౌడీషీటర్లు, వారిపై పెడుతున్న నిఘా చర్యలపై ఆరా తీశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీపీ సంబంధించి స్టేషన్ ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు. గంజాయి ఎక్కడా ఉండకూడదని, ఈవ్ టీజింగ్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటివి ఏ స్టేషన్ పరిధిలోనూ చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. పోక్సో కేసులపై ఆరా తీశారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తి పారదర్శకంగా తమ విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీసీపీ–1 అజితా వేజెండ్ల, జాయింట్ సీపీ(ఇన్‌చార్జ్), డీసీపీ–2 డి.మేరీ ప్రశాంతి, డీసీపీ(క్రైం) కె.లతామాధురి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి
Comments
Please login to add a commentAdd a comment