వైఎస్సార్ సీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
సాక్షి, విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లాలో 16 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. యువజన విభాగం అధ్యక్షుడిగా దొడ్డి కిరణ్, మహిళా విభాగం అధ్యక్షురాలుగా పేడాడ రమణి కుమారి, బీసీ సెల్ అధ్యక్షుడిగా సనపల రవీంద్ర భరత్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బోని శివరామకృష్ణ, మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా బర్కత్ అలీ, క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఆదేపల్లి రవీంద్రబాబు, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పులగం కొండారెడ్డి, మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా సేనాపతి అప్పారావు, వలంటీర్ వింగ్ అధ్యక్షుడిగా పీలా ప్రేమ్ కిరణ్ జగదీష్, వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఎస్.ప్రసాదరావు, వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడిగా రాయపు అనిల్‌కుమార్, లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఎం.బాజీరావు, చేనేత వింగ్ అధ్యక్షుడిగా చిక్కాల సత్యనారాయణ, సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడిగా బొండా ఉమా మహేశ్వరరావు, దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా వాసుపల్లి యల్లాజీ, బూత్ కమిటీ అధ్యక్షుడిగా గున్నంటి పూర్ణానంద శర్మను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment