పరస్పర సహకారంతో యువతకు ఉపాధి | - | Sakshi
Sakshi News home page

పరస్పర సహకారంతో యువతకు ఉపాధి

Published Thu, Jan 30 2025 12:56 AM | Last Updated on Thu, Jan 30 2025 12:56 AM

పరస్పర సహకారంతో యువతకు ఉపాధి

పరస్పర సహకారంతో యువతకు ఉపాధి

మహారాణిపేట: విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ సంస్థలు, పరిశ్రమల నిర్వాహకుల పరస్పర సహకారం, ప్రణాళికతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ అన్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం నిర్ణీత సమయంలో వచ్చేలా ప్రణాళికలు రచించాలని, ఉద్యోగ అవకాశాలకు తగ్గట్టు కోర్సులు అందించాలని ఆయా సంస్థలను కోరారు. ఇంటరాక్షన్‌ ఆన్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ జాబ్‌ క్రియేషన్‌ ఇన్‌ విశాఖపట్నం రీజియన్‌ అనే అంశంపై కలెక్టరేట్‌ మీటింగ్‌ హాలులో బుధవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అందుకు తగిన కార్యాచరణతో ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. విద్యా సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు నెలకు ఒక్కసారి ప్రత్యేకంగా సమావేశం కావాలని, అవసరాలను గుర్తించి అందుకు తగిన అభ్యర్థులను తయారు చేసుకోవాలన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమలను ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు, భవిష్యత్‌ అవకాశాల గురించి యువతకు తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ సంబంధిత యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, తగిన నైపుణ్యం కలిగిన వ్యక్తులను అందించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని అంశాల్లో నైపుణ్యం కలిగిన యువత స్థానికంగా లభ్యం కావడం లేదని, కంపెనీల అవసరాలకు సరిపడిన ఇంజినీర్లను తయారు చేసే కోర్సులు స్థానికంగా లేవన్నారు. దీనిపై ఆంధ్రా యూనివర్సిటీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ, ఐఐఎం విద్యా సంస్థల ప్రతినిధులు స్పందించారు. తగిన నైపుణ్యం కలిగిన యువత తమ వద్ద ఉన్నారని, అయితే వారికి ఉపాధి అవకాశాల గురించి తగిన సమాచారం లేదన్నారు. ఆయా కంపెనీల్లో ఉండే ఉద్యోగాలకు ఎలాంటి యువత కావాలో తెలిపితే.. అందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సీఐఐ ప్రతినిధులు మురళీ కృష్ణ, నీరజ్‌ సర్దా, గ్రంధి రాజేశ్‌, పీఎస్‌ ఠాగూర్‌, ఉపాధి కల్పనాధికారి సుబ్బిరెడ్డి, వివిధ విభాగాలు, విద్యాసంస్థలు, పరిశ్రమల అధికారులు పాల్గొన్నారు.

పరిశ్రమలు, విద్యా సంస్థల అధికారులకు కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ పిలుపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement