మహా కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
డాబాగార్డెన్స్: ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు విశాఖపట్నం నుంచి ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ(2+2 పుష్బ్యాక్) బస్సులు ఏర్పాటు చేసినట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. ప్రయాగరాజ్తో పాటు అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాలు దర్శించుకునేలా రానుపోను 7 రోజుల యాత్రను రూపొందించినట్టు చెప్పారు. యాత్రలో భాగంగా ప్రయాగరాజ్, కాశీ క్షేత్రాల్లో ఒక రోజు బస ఉంటుందని, వసతి, భోజన సదుపాయాలు ప్రయాణికులే చూసుకోవాలన్నారు. 34 మంది కలిసి వస్తే వారికి అనుకూలమైన రోజు బస్సు బయలుదేరుతుందని పేర్కొన్నారు. 34 మందికి, 7 రోజుల యాత్రకు రూ.2,74,000 చార్జీ నిర్ణయించినట్లు తెలిపారు. వివరాలకు 9052227083, 9959225594 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. ఒక టికెట్కు అయితే రూ.8 వేలు చెల్లించాలన్నారు. ఆసక్తి గలవారు www. apsrtconline. in వెబ్సైట్లో గానీ సమీప బస్ స్టేషన్, ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద టికెట్ పొందవచ్చన్నారు. మహా కుంభమేళాకు విశాఖ డిపో నుంచి ఫిబ్రవరి 4, 8, 12 తేదీల్లో బస్సులు బయలుదేరుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment