మల్లన్నా దీవించు | Sakshi
Sakshi News home page

మల్లన్నా దీవించు

Published Mon, May 6 2024 4:00 AM

మల్లన

భామిని: మండలంలోని ఎం.కె.పురంలో వెలసిన శ్రీ ఎండల మల్లికార్జున స్వామి సన్నిధిలో పాలకొండ శాసనసభ్యురాలు, వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి ఆదివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని, మళ్లీ జగన్‌మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ మొక్కు తీర్చారు. కార్యక్రమంలో వైఎస్సాఆర్‌సీపీ మండల నాయకులు ఉన్నారు.

గిరిజన మ్యూజియానికి

కొత్త హంగులు

సీతంపేట: టీడీపీ ప్రభుత్వం హయంలో ఆగిపోయిన గిరిజనమ్యూజియం పనులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పునఃప్రారంభించింది. ఈ మేరకు సీతంపేటలోని పాత పీఎంఆర్‌సీలో మ్యూజియం పనులు జరుగుతున్నాయి. రూ.కోటి అంచనా వ్యయంతో గిరిజన మ్యూ జియం నిర్మించడానికి నిధులు కేటాయించారు. 2017లో ఈ మ్యూజియానికి శంకుస్థాపన జరిగినా సక్రమంగా నిధులు కేటాయించకపోవడం, టీడీపీ ప్రభుత్వం పట్టించుకోని కారణంగా పనులు నిలిచిపోయాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్ల క్రితం ఈ పనులు పునఃప్రారంభమయ్యాయి. ఆదిమానవుడి దగ్గర నుంచి ఇప్పటివరకు జరిగిన మార్పులను చిత్రాల రూపంలో తయారు చేస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతోపాటు సీతంపేట ఏజెన్సీలో ఆదివాసీల సంస్క్రతి, సంప్రదాయాలు ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, పచ్చిమబెంగాల్‌, మహరాష్ట్ర, బీహార్‌లలో ఉన్న ఆదివాసీలు, ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉండే ఆదివాసీల జీవన విధానం కంటికి కనిపించేలా బొమ్మల రూపంలో చూపించాలని నిర్ణయించారు. గిరిజనులు ఇంట్లో వాడే వస్తువులు, కట్టుబాట్లు, వేటాడే వస్తువులు, పూర్వం నుంచి ఇప్పటివరకు దశలవారీగా మారిన మార్పులను చిత్ర రూపంలో ప్రదర్శించేందుకు బొమ్మలను సేకరించారు. ప్రస్తుతానికి రెండు బ్లాకుల్లో పనులు జరిగాయి. మ్యూజియం బయట కొత్తగా కొన్ని దుకాణ సము దాయాలను ఏర్పాటు చేశారు. గిరిజన మ్యూజి యం పూర్తయితే పర్యాటకంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందినట్లవుతుంది.

చంద్రబాబు మాటలు నమ్మొద్దు

● వైఎస్సార్‌సీపీ కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి

గరుగుబిల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు మాయమాటలు నమ్మవద్దని వైఎస్సార్‌ సీపీ కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని కొత్తూరు, శివ్వాం, గొట్టివలస, గొల్లవానివలస, తులసిరామినాయుడు వలస, ఉల్లిభద్ర గ్రామాల్లో ఆదివారం పర్యటించిన ఆమెకు ఆయా గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారని, ఆయన పా లనలో అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. పేదల అభ్యున్నతే ప్రధానంగా అమలు చేసిన పథకాలతో ఎంతోమంది జీవితాల్లో సంక్షేమ వెలుగులు నెలకొన్నాయన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోసపూరిత హామీలతో ప్రజలను మాయ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటారని, ఆయనను నమ్మితే రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ అంధకారమవుతుందన్నారు.

మల్లన్నా దీవించు
1/2

మల్లన్నా దీవించు

మల్లన్నా దీవించు
2/2

మల్లన్నా దీవించు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement