ప్రశాంతంగా ముగిసిన నీట్‌ | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన నీట్‌

Published Mon, May 6 2024 4:10 AM

ప్రశా

విజయనగరం అర్బన్‌: మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్‌ ఎంట్రెన్స్‌ అండ్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నీట్‌) జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 571 పట్టణాల్లోనూ, 14 బోర్టు సిటీలలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నీట్‌ను నిర్వహించింది. జిల్లా కేంద్రంలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో 1,727 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 40 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో బాలికలు 1,282 మంది, బాలురు 405 మంది ఉన్నట్టు పరీక్షల నిర్వహణ జిల్లా కో–ఆర్డినేటర్‌ రవి కె.మండా తెలిపారు.

బాలేరు రోడ్డుకు

ఏనుగుల గుంపు

భామిని: ఆహారం కొరతతో ఏనుగుల గుంపు పట్టపగలు ఆరు బయటకు వచ్చి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం భామిని మండలంలోని బాలేరు వద్ద ఏబీ రోడ్డు సమీపంలోకి నాలుగు ఏనుగుల గుంపు వచ్చి పంటలను తినివేశాయి. మామిడి చెట్ల కొమ్మలు, చెరకు పంటతో పాటు వ్యవసాయ బోరు పైపులను బయటకు లాగి పాడు చేశా యి. ప్రజలు, రోడ్డుపై ప్రయాణికులు బారులు తీరి చూస్తుండగానే ఏనుగులు విధ్వంసానికి పాల్పడ్డాయి. ఏనుగుల గుంపు రోడ్డు సమీపంలోకి రావడంతో గ్రామస్తులు పరుగుపెట్టారు. రాత్రిపూట రోడ్డుపై ప్రయాణాలు కష్టంగా మారుతున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది సమీపంలో లేక పోవడంతో ప్రజలు మండిపడుతున్నారు.

అందరి చూపు

వైఎస్సార్‌సీపీ వైపే...

సాలూరు: పట్టణంలోని 4వ వార్డు కౌన్సిలర్‌ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో ఆదివారం చేరాయి. వారికి వైఎస్సార్‌సీపీ సాలూరు అసెంబ్లీ అభ్యర్థి పీడిక రాజన్నదొర, పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానం పలికారు. చేరికల కార్యక్రమంలో రిటైర్డ్‌ ఎస్పీ చింతగడదాస్‌, పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు పలకండి

ఎమ్మెల్సీ డాక్టర్‌ పెనుమత్స సురేష్‌బాబు

నెల్లిమర్ల రూరల్‌: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన కొనసాగించిన సీఎం వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని ఎమ్మెల్సీ డాక్టర్‌ పెనుమత్స సురేష్‌బాబు కోరారు. బూరాడపేట, పారసాం గ్రామాలకు చెందిన వలస ఓటర్లతో విశాఖలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల హామీలను శతశాతం నెరవేర్చి ప్రజలను ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామన్నారు. సీఎం జగనన్న హామీ ఇచ్చారంటే తప్పక నెరవేరుస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లూ ఫ్యాన్‌ గుర్తుపై వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు చనమళ్లు వెంకటరమణ, నాయకులు మత్స సత్యనారాయణ, సంగంరెడ్డి జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ముగిసిన నీట్‌
1/6

ప్రశాంతంగా ముగిసిన నీట్‌

ప్రశాంతంగా ముగిసిన నీట్‌
2/6

ప్రశాంతంగా ముగిసిన నీట్‌

ప్రశాంతంగా ముగిసిన నీట్‌
3/6

ప్రశాంతంగా ముగిసిన నీట్‌

ప్రశాంతంగా ముగిసిన నీట్‌
4/6

ప్రశాంతంగా ముగిసిన నీట్‌

ప్రశాంతంగా ముగిసిన నీట్‌
5/6

ప్రశాంతంగా ముగిసిన నీట్‌

ప్రశాంతంగా ముగిసిన నీట్‌
6/6

ప్రశాంతంగా ముగిసిన నీట్‌

Advertisement
Advertisement