తొలి ఓటు పడింది | Sakshi
Sakshi News home page

తొలి ఓటు పడింది

Published Mon, May 6 2024 4:10 AM

తొలి

విజయనగరం అర్బన్‌: సాధారణ ఎన్నికల్లో భాగంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైంది. జేఎన్‌టీయూ జీవీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రెండు ఫెసిలి టేషన్‌ కేంద్రాలను కలెక్టర్‌ నాగలక్ష్మి సందర్శించారు. ఓటింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. క్యూలైన్లు, పోలింగ్‌ బూత్‌లు, హెల్ప్‌డెస్క్‌లను సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఉద్యోగులను ఆరా తీశారు. మౌలిక సదుపాయాల కల్పనపై పలు సూచనలు చేశారు. క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా, ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం క ల్పించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతీ ఉద్యోగి దరఖాస్తు చేస్తే, పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు. జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొత్తం పోస్టల్‌బ్యాలెట్‌ ఓట్లు 18,631 ఉండగా తొలిరోజు 4,989 మంది (26 శాతం) ఓటు హక్కును విని యోగించుకున్నారు. గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, రాజాం, ఎస్‌.కోట నియోజకవర్గ కేంద్రాల్లోనూ తొలిరోజు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఆయా నియో జకవర్గ రిటర్నింగ్‌ అధికారులు ఓటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించారు. ఉద్యోగులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

తొలిరోజు మొత్తం ఓట్లలో 26 శాతం పోలింగ్‌

తొలిరోజు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ (నియోజకవర్గాల వారీగా) ఇలా..

నియోజకవర్గం పోస్టల్‌ తొలి రోజు

బ్యాలెట్‌లు పోలింగ్‌

బొబ్బిలి 2,105 749 చీపురుపల్లి 1,405 385

గజపతినగరం 1,655 603

నెల్లిమర్ల 1,525 587

విజయనగరం 3,975 1,356 ఎస్‌.కోట 1,776 563

రాజాం 1,741 746

మొత్తం 18,631 4,989

ఇతర జిల్లాల్లో పనిచేస్తూ ఇక్కడ ఓటు ఉన్న ఎన్నికల సిబ్బంది వేసిన పోస్టల్‌ బ్యాలెట్‌లు : 670

తొలి ఓటు పడింది
1/2

తొలి ఓటు పడింది

తొలి ఓటు పడింది
2/2

తొలి ఓటు పడింది

Advertisement
Advertisement