సంక్షేమ పాలన మెచ్చి.. | Sakshi
Sakshi News home page

సంక్షేమ పాలన మెచ్చి..

Published Thu, May 9 2024 3:55 AM

సంక్షేమ పాలన మెచ్చి..

చీపురుపల్లి రూరల్‌ (గరివిడి): రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చేసి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు జోరందుకున్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గరివిడి మండలంలోని వెదుళ్లవలసలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండదాడి పంచాయతీ పరిధి చిన వెంకటాపురం, పెద వెంకటాపురం.. వెదుళ్లవలస పంచాయతీ పరిధి ఆవగూడెం గ్రామాల నుంచి టిడిపికి చెందిన 56 కుటుంబాలు మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన పాసి బంగారప్పుడు, పాసి రాజప్పుడు, బాగు శ్రీరాములు, మండాది ఆదినారాయణ, మంత్రి చిన్నోడు, లండ గోవింద్‌, నక్కేల జోగులు, బాగు అప్పయ్య, పల్లె ఈశ్వరరావు, గులివిందల రాము, తదితర 56 కుటుంబాలకు చెందిన వారందరికీ మంత్రి బొత్స సత్యనారాయణ కండువాలు వేసి పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం తధ్యమని.. జగన్‌ మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయమని జోష్యం చెప్పారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే ప్రతిఒక్కరూ ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్‌ కోఆర్డినేటర్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ మీసాల విశ్వేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ గుడివాడ శ్రీరాములనాయుడు, స్థానిక సర్పంచ్‌ గుడివాడ తమ్మినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరిన

56 కుటుంబాలు

కండువాలు వేసి ఆహ్వానించిన

మంత్రి బొత్స సత్యనారాయణ

Advertisement
 
Advertisement
 
Advertisement