రైతన్నకుఉపాధి అండ | Sakshi
Sakshi News home page

రైతన్నకుఉపాధి అండ

Published Sat, May 25 2024 2:50 PM

రైతన్

రైతుకు మేలు

పండ్ల తోటలు, టేకు మొక్కల పెంపకానికి ఉపాధిహామీ పథకం నిధులు కేటాయించడం రైతుకు లాభదాయకం. కందకాల తవ్వకం మంచి ఆలోచన. ఉపాధిహామీ పథకం అధికారుల సూచనల మేరకు మా పొలాల్లో కందకాల నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాను.

– కె.అప్పలనాయుడు,

లక్ష్మీపురం, రేగిడి మండలం

నీటి కుంటల ఏర్పాటుకు దరఖాస్తు చేశా

పొలాల్లో నీటి కుంటల ఏర్పాటుకు ఉపాధిహామీ పనులు కల్పించడం, రైతులకే ఆ పనులు ఇవ్వడం సంతోషదాయకం. మా పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాను. పని మంజూరు చేశారు. నీటి కుంటల ఏర్పాటుతో నీటిని ఆదాచేయవచ్చు. – టంకాల రాంబాబు,

పొగిరి, రాజాం మండలం

రాజాం: ఉపాధిహామీ పనులు పల్లెల్లో జోరుగా సాగుతున్నాయి. లక్షలాది మంది వేతనదారులు ప్రతిరోజు పనుల్లో పాల్గొంటున్నారు. తాజా నిబంధనల ప్రకారం రైతన్నకు ఉపాధిహామీ పథకం అండగా నిలవనుంది. పొలాల్లో గట్లు బాగుచేయడం, బట్టి(కాలువ)ల్లో పూడికల తొలగింపు, నీటి కుంటల నిర్మాణం, చెట్ల చుట్టూ కందకాలు తవ్వడం, తోటల పెంపకానికి ఉచితంగా మొక్కల పంపిణీ, వాటి సంరక్షణకు అవసరమైన నిధులు ఉపాధిహామీ పథకం నుంచి మంజూరుకానున్నాయి. రైతుకు అవసరమైన పనుల ఎంపికకు అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికే పనుల నిర్వహణపై ఫీల్డ్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. పనుల కోసం రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

పనులు ఇలా..

ఉపాధిహామీ పథకం కొత్త పనుల్లో భాగంగా రైతులు తమ పొలాల్లో పండ్ల తోటలు పెంచుకునేందుకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు. హార్టికల్చర్‌ ద్వారా 14 రకాల పండ్ల తోటల మొక్కలను రైతులకు ఉచితంగా అందజేస్తారు. చిన్న, సన్నకారు రైతులకు ఎకరాకు 60 నుంచి 70 వరకూ మొక్కలు ఇస్తారు. వీటిని పొలాల్లో నాటడంతో పాటు మూడేళ్లపాటు పెంచుకునేందుకు ఏడాదికి రూ.35 వేలు వరకూ నిధులను ఉపాధిహామీ పథకం నుంచి చెల్లిస్తారు. మూడేళ్ల అనంతరం మొక్కల ఫలసాయం ఆయా రైతులే పొందవచ్చు. టేకు మొక్కలు వేసుకునే రైతులకు కూడా హార్టికల్చర్‌ ద్వారా ఎకరాకు 200 టేకు మొక్కలను అందించనున్నారు. వీటిని నాటేందుకు, సంరక్షణ నిమిత్తం మూడేళ్లు నిధులు ఇస్తారు.

పచ్చదనం ప్రధాన అంశంగా ఉపాధి హామీ పథకంలో రైతులు తమ పొలాలు చుట్టూ కందకాలు (ట్రెంచ్‌లు) తవ్వుకునేందుకు, పొలాలు గట్లు, పొలాల్లో ఉన్న చెట్లు, మొక్కలు చుట్టూ కందకాలు ఏర్పాటుకు ఉపాధి పథకం ద్వారా ఆయా రైతులకు నిధులు చెల్లించనున్నారు. ఒక్కోచోట ఈ పనులు ద్వారా రైతులకు అటు తమ పొలాలు వద్ద చెట్లు సంరంక్షించుకునే అవకాశం లభించడంతో పాటు రూ. 17 వేల వరకూ వేతనాలు ఉపాధి హామీ పథకం కింద లభించనున్నాయి. మరో వైపు ఈ కందకాల కారణంగా చెట్టుకు నీటి సదుపాయం లభిస్తుంది. పొలాల్లో నీటి కాలువలు ఏర్పడతాయి. ఒక పొలం నుంచి ఇంకో పొలానికి చీడపీడలు వ్యాపించవు. ఎకరా నుంచి మూడెకరాలు వరకూ పంటపొలాలు ఉన్న రైతులు తమ మెట్ట ప్రాంత పొలాల్లో నీటి కుంటలు తవ్వుకునేందుకు నిధులు కేటాయిస్తున్నారు. 9 మీటర్లు వెడల్పు, 9 మీటర్లు పొడవుతో పాటు రెండు మీటర్ల లోతు మేర వీటిని తవ్వుకోవాలని, వీటి నిర్మాణాలకు ఆయా రైతులకు రూ. 50 వేలు వరకూ నిధులు వెచ్చిస్తామని ఉపాధిహామీ అధికారులు చెబుతున్నారు. ఈ నీటి కుంటల వల్ల వర్షపు నీరు నిల్వ ఉండడంతో పాటు పొలాల్లో భూసారం పెరిగి, పలురకాల పంటలు నీటి కొరతలేకుండా పండించుకునే వీలుంది. కొత్త పనుల కోసం ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా 480 దరఖాస్తులు వచ్చినట్లు రాజాం ఏపీడీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

కందకాలు, నీటి కుంటలు

నీటి కుంటలు, కందకాల పనులకు ప్రాధాన్యం

హార్టికల్చర్‌ నుంచి ఉచితంగా పండ్ల మొక్కల పంపిణీ

పెంపకానికి ఉపాధిహామీ నిధుల చెల్లింపు

మూడేళ్లపాటు మొక్కల సంరక్షణ బాధ్యత

నీటి కుంటలతో వర్షపునీరు ఆదా

జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ

ఇప్పటివరకూ 480కిపైగా దరఖాస్తులు

రైతన్నకుఉపాధి అండ
1/4

రైతన్నకుఉపాధి అండ

రైతన్నకుఉపాధి అండ
2/4

రైతన్నకుఉపాధి అండ

రైతన్నకుఉపాధి అండ
3/4

రైతన్నకుఉపాధి అండ

రైతన్నకుఉపాధి అండ
4/4

రైతన్నకుఉపాధి అండ

Advertisement
 
Advertisement
 
Advertisement