కళలు నేర్పే వారి కల నెరవేరింది... | Sakshi
Sakshi News home page

కళలు నేర్పే వారి కల నెరవేరింది...

Published Sun, May 26 2024 4:55 AM

కళలు

బాలభవన్‌ కేంద్రాల్లో సిబ్బందిని రెగ్యులర్‌ చేసిన ప్రభుత్వం

జీఓ 62 ద్వారా వారి జీవితాల్లో వెలుగులు

మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి కృషితో

కరుణించిన సర్కారు

చీపురుపల్లి: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా మూడు దశాబ్దాలుగా వారంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కల. ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ వారి కష్టాన్ని గుర్తించలేదు. అయినప్పటికీ అరకొర వేతనాలతో పనిచేస్తూ ఏ రోజుకై నా తమను ఆదుకునే దేవుడు రాకపోతాడా అంటూ పిల్లలను తీర్చిదిద్దుతూ పని చేశారు. ఎట్టకేలకు దేవుడు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి రూపంలో వచ్చి మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కలను నెరవేర్చాడు. జవహర్‌ బాలభవన్‌ కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తింపునిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జవహర్‌ బాలభవన్‌ కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బంది సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి. జీవితాంతం సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిని మరిచిపోలేమని వారంతామ చెబుతుండడంవిశేషం.

బాలభవన్‌ కేంద్రాలంటే ఏమిటి..

పేద ఇళ్లల్లో జన్మించిన చిన్నారుల్లో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికి తీయాలంటే చాలా ఫీజులు కట్టుకుని ప్రైవేట్‌ కేంద్రాల్లో శిక్షణ ఇప్పించాలి. ఇది అందరికీ సాధ్యం కాకపోవడంతో వారి ఆశయాన్ని నెరవేర్చాలనే లక్ష్యంతో 1962లో ఇందిరాగాంధీ దేశ వ్యాప్తంగా జవహర్‌ బాలభవన్‌ కేంద్రాలు నెలకొల్పింది. అనంతర కాలంలో 1993లో ఏపీలో పాఠశాల విద్యాశాఖ ద్వారా జవహర్‌ బాలభవన్‌లు ఏర్పడ్డాయి. ఈ కేంద్రాల ద్వారా చిన్నారులకు నిరంతరం శాసీ్త్రయ నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, క్రియేటివ్‌ రైటింగ్‌ వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తూ వారిలో ఉన్న దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభకు పదును పెడుతున్నారు. కేంద్రాల్లో శిక్షణ పొందిన ఎంతోమంది చిన్నారులు ఎంతో గొప స్థాయికి చేరుకున్నారు.

రాష్ట్రంలో బాలభవన్‌ కేంద్రాలు ఇలా.....

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ జవహర్‌ బాలభవన్‌ కేంద్రాలున్నాయి. అందులో భాగంగానే చీపురుపల్లి, రాజాం, విజయనగరం, విశాఖపట్టణం, కాకినాడ, అనంతపురం, పాలకొల్లు, కడప, విజయవాడ, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, మచిలీపట్నం, ఏలూరు, నంధ్యాల, తదితర ప్రాంతాల్లో జవహర్‌ బాలభవన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలోనూ దాదాపు 300 మంది విద్యార్థులు నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, క్రియేటివ్‌ రైటింగ్‌ విభాగాల్లో శిక్షణ పొందుతున్నారు. అంతేకాకుండా ప్రతిఏటా వేసవి సెలవుల్లో వేసవి శిక్షణ తరగతులు పేరుతో వందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంటారు.

అరకొర జీతాలతోనే...

జవహర్‌ బాలభవన్‌ కేంద్రాల్లో సూపరింటెండెంట్‌, ఇన్‌స్ట్రక్టర్‌, ఆయా, శిక్షకులుగా చాలా మంది తాత్కాలిక ప్రాతిపదికన దశాబ్దాల కాలంగా విధులు నిర్వహిస్తున్నారు. వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఎప్పటి నుంచో ప్రభుత్వాలను కోరుతున్నారు. కాని ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో వీరి సమస్యను మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ప్రభుత్వం వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ జీఓ విడుదల చేసింది.

జీవిత కాలం కోరిక నెరవేరింది.....

మూడు దశాబ్దాల కాలంగా బాలభవన్‌ కేంద్రంలో పనిచేస్తూ ఎంతో మంది పిల్లలను నృత్యం, చిత్రలేఖనం, సంగీతంలో తీర్చిదిద్దాం. తమ కేంద్రాల్లో నృత్యం నేర్చుకున్న పిల్లలు విదేశాల్లో సైతం ప్రదర్శనలు ఇచ్చారు. అరకొర జీతాలతోనే పని చేశాం. బాలభవన్‌ కేంద్రాల్లో పని చేసే సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలనే డిమాండ్‌ను మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం జరిగే విధంగా చూశారు. తమను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీఓ 62ను విడుదల చేసింది. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి జీవిత కాలం రుణపడి ఉంటాం.

– డాక్టర్‌ సుంకరి రమేష్‌, సూపరింటెండెంట్‌, జవహర్‌ బాలభవన్‌ కేంద్రం, చీపురుపల్లి

కళలు నేర్పే వారి కల నెరవేరింది...
1/2

కళలు నేర్పే వారి కల నెరవేరింది...

కళలు నేర్పే వారి కల నెరవేరింది...
2/2

కళలు నేర్పే వారి కల నెరవేరింది...

Advertisement
 
Advertisement
 
Advertisement