సమయం లేదు మిత్రమా..! | Sakshi
Sakshi News home page

సమయం లేదు మిత్రమా..!

Published Tue, May 7 2024 5:00 AM

సమయం

వనపర్తి

మంగళవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2024

వివరాలు IIలో u

సాక్షి, నాగర్‌కర్నూల్‌: లోక్‌సభ ఎన్నికల సంగ్రామానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ లోక్‌సభ అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నెల 13న పోలింగ్‌ నిర్వహించనుండగా, 11న సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని చాలావరకు మండలాలు, గ్రామాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు చేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన సమాయాన్ని వృథా చేయకుండా నాయకులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. పెద్ద పట్టణాలు, పెద్ద గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రచార రథాలు, సోషల్‌మీడియా ద్వారా విస్త్రృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

● ఎన్నికల్లో సామాజిక వర్గాల ఓట్లే కీలకంగా మారిన నేపథ్యంలో వారి మద్దతు కూడగట్టుకునేందుకు కుల, మత పెద్దలతో అభ్యర్థులు, ముఖ్య నేతలు రహస్య భేటీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గాలపై దృష్టి సారించి వారిని కట్టుకునేందుకు ముందస్తు హామీలిస్తున్నారు. ఓ పక్క గెలుపు వ్యూహాలు రచిస్తూనే మరోపక్క ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలను తమ పార్టీల్లో చేర్పించుకుంటున్నారు.

మాటల తూటాలతో రాజకీయ వేడి..

మే నెల ప్రారంభం కావడంతో మండుతున్న ఎండలకు తోడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య మాటల తూటాలతో లోక్‌సభ ఎన్నికల వాతావరణం రణరంగంగా మారింది. ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతి విమర్శలతో ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్‌ స్థానాల్లో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఆరుసార్లు పర్యటించారు. అలాగే ఈనెల 11న ప్రచారానికి ఆఖరి రోజున సాయంత్రం 3 గంటలకు మక్తల్‌లో నిర్వహించే కాంగ్రెస్‌ జనజాతర సభకు మరోసారి హాజరుకానున్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ లక్ష్యంగా ఆయన విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. బంగ్లా రాజకీయాలకు పాలమూరు ప్రజలు స్వస్తిపలకాలంటూ ఆయన ప్రజలకు పిలుపునివ్వడం రాజకీయంగా వేడిని పుట్టించింది. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ సైతం తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌దామి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ డీకే అరుణకు మద్దతుగా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ నారాయణపేటలో నిర్వహించనున్న బహిరంగసభకు హాజరు కానున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి తరఫున గులాబీబాస్‌ కేసీఆర్‌ చేపట్టిన బస్సుయాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ పర్యటనలతో ఈ స్థానంలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లురవి తరఫున గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో నిర్వహించిన జనజాతర సభకు అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు. బీజేపీ సైతం తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలైని రంగంలోకి దింపి కల్వకుర్తిలో భారీ రోడ్‌షో నిర్వహించింది. మరో రెండు రోజుల్లో మరో జాతీయస్థాయి నేతతో ప్రచారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఇంకా 5 రోజులే..

ప్రచార రథాలు, సామాజిక

మాధ్యమాలే కీలకం

మండలాలు, గ్రామాలకు

చేరని అభ్యర్థుల ప్రచారం

కులపెద్దలతో రహస్య భేటీలు, హామీలు

అన్ని పార్టీల్లో కొనసాగుతున్న

చేరికల పర్వం

సమయం లేదు మిత్రమా..!
1/4

సమయం లేదు మిత్రమా..!

సమయం లేదు మిత్రమా..!
2/4

సమయం లేదు మిత్రమా..!

సమయం లేదు మిత్రమా..!
3/4

సమయం లేదు మిత్రమా..!

సమయం లేదు మిత్రమా..!
4/4

సమయం లేదు మిత్రమా..!

Advertisement
 
Advertisement