ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

Published Sat, May 25 2024 1:25 PM

ధాన్య

నర్సంపేట: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోళ్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రావీణ్య మాట్లాడుతూ కాంటాల్లో ఆలస్యం జరగొద్దని, టార్పాలిన్‌ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఇప్పటి వరకు 50 శాతం ధాన్యం సేకరించి మిల్లులకు పంపినట్లు తెలిపారు. వర్షంతో తడిసిన ధాన్యాన్ని వంద శాతం కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ట్రెయినీ ఐఎఫ్‌ఎస్‌ రేవంత్‌చంద్ర, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీసీఎస్‌ఓ శివప్రసాద్‌రెడ్డి, డీఎం సంధ్యారాణి, జిల్లా కోఆపరేటివ్‌ అధికారి సంజీవరెడ్డి పాల్గొన్నారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం..

ఖానాపురం: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ ప్రావీణ్య అన్నారు. మండల కేంద్రంలోని సబ్‌మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. తేమ శాతం, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా 1010 రకాన్ని కామన్‌ కింద తీసుకోవడంతో క్వింటాలుకు రూ.20 నష్టపోతున్నామని రైతులు కలెక్టర్‌కు తెలిపారు. ఖరీఫ్‌లో ఏ రకం పంట వేయాలో ముందే చెప్పాలని, ప్రస్తుతం దొడ్డు రకాలు సాగు చేసి రూ.500 బోనస్‌ను నష్టపోయామని కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ ప్రావీణ్య మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 52వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించినట్లు తెలిపారు. మిగిలిన 50 శాతం ధాన్యాన్ని కూడా త్వరితగతిన కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యంలో కోతలు విధించినా, రైతులను ఇబ్బందులు పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్‌ 10 లోపు పూర్తిస్థాయిలో దుస్తులు అందిస్తామని పేర్కొన్నారు. ఆమె వెంట ట్రెయినీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి రేవంత్‌చంద్ర, డీఆర్డీఓ కౌసల్యాదేవి,డీసీఎస్‌ఓ శివప్రసాద్‌రెడ్డి, సివిల్‌ సప్లయీస్‌ డీఎం సంధ్యారాణి, డీసీఓ సంజీవరెడ్డి, తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు పాల్గొన్నారు.

కుట్టు మిషన్‌ కేంద్రం పరిశీలన

నర్సంపేట రూరల్‌ : మహేశ్వరంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళాశక్తి కుట్టు మిషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రావీ ణ్య పరిశీలించారు. ఈసెంటర్‌ పరిధిలోని గ్రామాల పాఠశాలల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది యూనిఫాం కుట్టించుకున్నారు, రోజు కు ఎన్ని డ్రెస్సులు కుడుతున్నారని ఆరా తీశారు. రోజుకు ఐదు చొప్పున డ్రెస్సులు కుడుతున్నామని మహిళలు తెలిపారు. 95 మంది బాలికలు, 106 మంది బాలురు ఉన్నారన్నారు. అనంతరం హేమ్లతండా, రంగంపల్లి విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేశారు. ట్రెయినీ ఐఎఫ్‌ఎస్‌ రేవంత్‌చంద్ర, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, అదనపు డీఆర్‌డీఓ రేణుకాదేవి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ రత్నమాల, డీపీఎం దయాకర్‌ ఉన్నారు.

కలెక్టర్‌ ప్రావీణ్య

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
1/1

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

Advertisement
 
Advertisement
 
Advertisement