పెళ్లి విందులో విషాదం
మూత్రవిసర్జనకు వెళ్లి పొలం ఒడ్డుపై నుంచి పడి వధూవరుల తాత మృతి
బోల్లోనిపల్లి గ్రామంలో ఘటన
నల్లబెల్లి: పెళ్లి విందులో విషాదం నెలకొంది. బంధుమిత్రులతో కలిసి విఽందు కార్యక్రమానికి హాజరైన వధూవరుల తాత మూత్రవిసర్జనకు వెళ్లి మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లెంకాలపల్లి గ్రామానికి చెందిన నాతి సాంబయ్య (70) తన కుమారుడు కుమారస్వామి కుమార్తె చందనను బోల్లోపల్లిలోని బిడ్డ కుమారుడు పవన్‌కు ఇచ్చి గురువారం ఘనంగా వివాహం జరిపించాడు.
బోల్లోనిపల్లిలో శుక్రవారం జరిగిన విందు కార్యక్రమానికి బంధుమిత్రులతో కలిసి వెళ్లాడు. అనంతరం అందరితో కలిసి సాంబయ్య సమీప పంటపొలాల్లోకి మూత్రవిసర్జనకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఒడ్డుపై నుంచి కిందపడిపోగా ఎవరు గమనించకపోవడంతో ఆయన మృతిచెందాడు. సాంబయ్య మృతితో లెంకాలపల్లి, బోల్లోనిపల్లి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment