పశువధ శాలపై అధికారుల తీరు అనుమానాస్పదం
ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్
తణుకు అర్బన్: తణుకు మండలం తేతలిలో పశు వధ శాలపై అధికారుల తీరు అనుమా నాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మండిపడ్డారు. సోమవారం జరిగిన తణుకు మండల పరిషత్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న పశువధ శాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రజలపక్షాన నిలవాల్సిన అధికారులు తప్పుడు సంకేతాలు ఇచ్చేలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఫ్యాక్టరీ అనుమతుల్లో లోపాలున్నాయని ప్ర జలు చెబుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాస్పదంగా ఉందన్నారు.
పోలీస్ పికెటింగ్ ఎందుకు?
తేతలి ప్రజలు, గోసేవా సమితి ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీస్ పికెటింగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని, పోలీసుల కాపలా తో ఫ్యాక్టరీ నడిపించడమేంటని, ప్రజలేమైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించారా అని నిలదీశారు.
ఆటోడ్రైవర్‌పై జరిమానా సరికాదు
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆటో డ్రైవర్‌కు జరిమానా వ్యవహారం బాధాకరమని ఎమ్మెల్సీ అన్నా రు. జిల్లా మారిందంటూ రూ.3,400 జరిమానా విధిస్తారా అని రవాణా శాఖ అధికారిని నిలదీశారు. ఒత్తిళ్లకు లొంగి తప్పులు చేయవద్దని హితవుపలికారు. తణుకు జాతీయ రహదారికి ఇరువైపులా కూడా తూర్పుగోదావరి జిల్లా పరిధి ఉందన్నారు. రవాణా విభాగంలో ఇబ్బందులను మండలి సమా వేశంలో చర్చిస్తామన్నారు. ఎంపీపీ రుద్రా ధనరా జు, జెడ్పీటీసీ ముళ్లపూడి అన్నపూర్ణాదేవి, ఎంపీడీఓ ఆర్.లోహిత్ జయసాగర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment