కూటమి కక్ష సాధింపు
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఏలూరు నగరంలోని తంగెళ్లమూడి ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు పేరుతో ఏలూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ బీసీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు నెర్సు చిరంజీవులుకు సంబంధించిన షాపులను బుధవారం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు దగ్గర ఉండి కూల్చివేయించారు. నగరంలో గుర్తించిన ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టామని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదంటూ అధికారులు చెబుతున్నారు. అయితే స్థానిక ప్రజా ప్రతినిధుల ప్రోద్బలంతోనే నగరపాలక సంస్థ అధికారులు తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణల తొలగింపు పేరుతో తంగెళ్లమూడి వంతెన ఎదురుగా ఉన్న ప్రాంతం నుంచి దిగువ రోడ్డు వైపు ఒకటి రెండు చోట్ల ఇంటి ముందు ఉన్న షెడ్లను తొలగించారు. తొలగించిన ఒకటి, రెండు ఆక్రమణలలో నెరుసు చిరంజీవులకు చెందిన షాపులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment