ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
భీమవరం: ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఇంటర్ ప్రాక్టికల్, పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పరీక్షల్లో భాగంగా ఫిబ్రవరి 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యుయేషన్ ఎడ్యుకేషనల్ పరీక్ష, ఫిబ్రవరి 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష, ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్, జనరల్ ఓకేషనల్ కోర్సుల పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాన పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 20 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలుంటాయన్నారు. ఇంటర్ మొదటి ఏడాది 19,775 మంది, రెండో ఏడాది 18,128 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment