ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్
భీమవరం/తాడేపల్లిగూడెం: భీమవరం డీఎన్నార్ కళాశాలలో బుధవారం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెక్షన్–1 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం, మధ్యాహ్నం నూరు శాతం హాజరు నమోదైంది. వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం జరిగిన పరీక్షకు 222 మంది హాజరుకావాల్సి ఉండగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 219 మందికి 219 మంది హాజరయ్యారు.
టీచర్ల వివరాలు నమోదు చేసుకోవాలి
భీమవరం: జిల్లాలోని ఉపాధ్యాయులంతా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం డేటాలో వివరాలు అప్‌లోడ్ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో తప్పుగా నమోదు చేసుకున్న వివరాలను ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసుకోవాలని సూచించారు.
సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
పెనుగొండ: పెనుగొండలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనపై ఏర్పాట్లపై కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఎస్పీ నయీంలు సమీక్షించారు. వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఈ నెల 31న పెనుగొండలోని మూలవిరాట్ వాసవీ మాతను, శాంతి థాంలోని వాసవీ మాతను సందర్శించి పూజలు చేస్తారు. ఏఎంసీలోని హెలీప్యాడ్‌ను పరిశీలించి సూచనలు చేశారు. తొలుత సందర్శించే శ్రీనగరేశ్వర మహిషాసురమర్దనీ వాసవీ కన్యక పరమేశ్వరి ఆలయం, నిత్యాన్నదాన సత్రం, హోమ నిర్వహణా ప్రాంతం, గోశాల, శాంతి థాంలోని రుషీగోత్ర మందిరాన్ని పరిశీలించారు.
బ్రిడ్జ్ కోర్సులో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఉండి: బ్రిడ్జ్ కోర్సులో 2025 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో రెండేళ్ళ డిప్లమో కోర్సులో నేరుగా ప్రవేశం కోసం 2 ఏళ్ళ ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్ వేగేశ్న శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌బీటీఈటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం రెండేళకల ఐటీఐ కోర్సు 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాలని తెలి పారు. బ్రిడ్జ్ కోర్సు పరీక్ష కోసం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. దీని కోసం ఈ నెల 27 నుంచి వచ్చే నెల 21 వరకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. పూర్తి వివరాల కోసం ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐలో సంప్రదించాలని తెలిపారు.
ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనమే
పాలకొల్లు అర్బన్: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనమేనని స్టీల్ ప్లాంట్ రక్షణ సమితి నేతలు రామస్వామి, గుర్రప్ప, మహేష్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ జాత బుధవారం పాలకొల్లుకు చేరింది. దీనిలో భాగంగా గాంధీబొమ్మల సెంటర్‌లో నేతలు మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌కు పూర్తి రక్షణ కావాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే సెయిల్‌లో విలీనం చేసి ప్రత్యేక గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రకటన చేయాలని కోరారు. విశాఖ ఉక్కు కార్మికులకు అండగా నిలిచిన ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ డిమాండ్లు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. సీసీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలన్, కవురు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లపై చర్చిస్తున్న కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పితాని, ఎస్పీ నయీం అస్మీ
Comments
Please login to add a commentAdd a comment