కుక్కునూరులో అస్థిపంజరం లభ్యం
కుక్కునూరులో బుధవారం మనిషి అస్థిపంజరం లభ్యమైంది. మృతుడు తెలంగాణలోని చర్ల ప్రాంతానికి చెందిన అయితా రమేష్‌గా పోలీసులు గుర్తించారు. 8లో u
ఏలూరు(మెట్రో): ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.వెట్రిసెల్వి కోరారు. బుధవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ చేస్తారన్నారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 27న ఉదయం 8.00 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, మార్చి 3న కౌంటింగ్ ఉంటుందన్నారు. మార్చి 8 నాటికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని వెల్లడించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు, కాకినాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 440 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఎన్నికల నేపద్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment