భుజబలపట్నం హైస్కూల్‌ పీడీపై విచారణ | - | Sakshi
Sakshi News home page

భుజబలపట్నం హైస్కూల్‌ పీడీపై విచారణ

Published Wed, Jan 29 2025 2:01 AM | Last Updated on Wed, Jan 29 2025 2:01 AM

భుజబలపట్నం హైస్కూల్‌ పీడీపై విచారణ

భుజబలపట్నం హైస్కూల్‌ పీడీపై విచారణ

పదో తరగతి బాలికను పెళ్లాడతాననన్న గొడవపై వివాదం

కై కలూరు: స్కూల్‌ పీడీ పదో తరగతి విద్యార్థితో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకుంటానని అల్లరి చేశాడు. ఈ ఘటనపై మంగళవారం డీవైఈవో విచారణ చేశారు. కై కలూరు మండలం భుజబలపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దాసరి నాగేశ్వరరావు(47)కు వివాహం కాలేదు. సొంతూరు భుజబలపట్నానికే బదిలీల్లో వచ్చాడు. పాఠశాల సమీప గ్రామానికి చెందిన పీడీ సామాజికవర్గానికి చెందిన బాలిక(15) పదో తరగతి చదువుతోంది. తల్లి జీవనోపాధి కోసం దుబాయిలో ఉంటుంది. క్రీడలు నేర్పించే క్రమంలో నాగేశ్వరరావు బాలికతో కొన్ని నెలలుగా పరిచయం పెంచుకున్నాడు. సెల్‌ఫోన్‌ కొనిచ్చాడు. సంక్రాంతి పండగ రోజుల్లో బాలిక ఇంటికి వెళ్ళి తండ్రి, బాలిక నానమ్మతో వివాహం చేసుకుంటానని చెప్పాడు. దీంతో సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత బాలిక నానమ్మ స్కూల్‌ హెచ్‌ఎం రాజ్యలక్ష్మికి ఫిర్యాదు చేశారు. ఆమె విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటలక్ష్మమ్మకు తెలిపారు. ఆమె ఆదేశాలతో డీవైఈవో రవిప్రకాష్‌, సిబ్బందితో కలసి విచారణ చేశారు. నాగేశ్వరరావును స్కూల్‌కు పిలిపించారు. బాలికను విచారించారు. సహచర ఉపాధ్యాయులు, బాలిక, పీడీ, పదో తరగతి క్లాసుల విద్యార్థుల నుంచి లిఖిత పూర్వకంగా నివేదిక తీసుకున్నారు. జిల్లా అధికారులకు నివేదిస్తామని డీవైఈవో రవిప్రకాష్‌ చెప్పారు. పీడీ నాగేశ్వరరావు మండవల్లి హైస్కూల్‌లో పనిచేసినప్పుడు ఇలాంటి వివాదాలనే ఎదుర్కొన్నాడు. అక్కడ నుంచి పనిష్‌మెంటుగా చినగొల్లపాలెం వెళ్ళాడు. విద్యార్థులను ఆటల పోటీలకు పీడీతో పంపించాలంటే బయపడే పరిస్థితి వచ్చింది. స్కూలు పరువు పోతుందని గ్రామంలో కొందరు పెద్దలు రాజీయత్నాలకు ప్రయత్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement