దాడికి మూల్యం చెల్లించక తప్పదు | - | Sakshi
Sakshi News home page

దాడికి మూల్యం చెల్లించక తప్పదు

Published Wed, Jan 29 2025 2:01 AM | Last Updated on Wed, Jan 29 2025 2:01 AM

దాడిక

దాడికి మూల్యం చెల్లించక తప్పదు

మహిళలపై దాడికి దిగిన పశువధ శాల యాజమాన్యం వారికి సహకరిస్తున్న పాలకులు, అధికారులు భవిష్యత్తులో తగిన మూల్యాన్ని చెల్లించక తప్పదు. మా ఇళ్లలో మేము ఉండలేకపోతున్నాం అని రోడ్డెక్కిన మహిళలను కొట్టే స్థాయికి దిగజారిపోయారంటే డబ్బు ఎలా అమ్ముడు పోయారో అర్ధమవుతోంది. తణుకు ప్రజానీకాన్ని భాగస్వామ్యులను చేస్తూ రాబోయే రోజుల్లో పశువధ శాలను ప్రోత్సహిస్తున్న వారికి కంటి మీద నిద్రలేకుండా చేస్తాం.

– అనుకుల రమేష్‌, న్యాయవాది, తణుకు

చంపేస్తామని బెదిరించారు

పశువులతో వచ్చిన 6 వ్యాన్‌లను అడ్డుకున్న మమ్మల్ని పశువధ శాల యాజమాన్యం పంపిన గూండాలు ఇస్టానుసారంగా కొట్టారు. గుద్ది బూతులు తిట్టారు. పోలీసుల ఎదురుగానే మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. ఇంత జరుగుతున్నా మాకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు మాపై కేసులు నమోదు చేస్తామని బెదిరించడం ఎంతవరకు సబబు.

– వల్లూరి గంగాభవాని, సజ్జాపురం, తణుకు

యాజమాన్యానికే పోలీసుల మద్దతు

100 నంబరుకు రెండు సార్లు ఫోన్‌ చేస్తే కానీ పోలీసులు రాలేదు. వచ్చిన తరువాత కూడా ఫ్యాక్టరీకి మద్దతుగా మాపై జులుం ప్రదర్శించారు. రౌడీలను తీసుకువచ్చి మాపై దాడులు చేశారు. మా ఇంట్లో మమ్మల్ని బతికేలా చూడమని వేడుకున్నాం. రోడ్డెక్కాం, కాళ్లు పట్టుకుంటామని అన్నాం. పోలీస్‌ స్టేషన్‌ల చుట్టూ తిరిగాం చివరకు మాపై దాడి చేసి మమ్మల్ని కొట్టే పరిస్థితి వచ్చింది.

– పి.దుర్గాభవాని, మహాలక్ష్మీ నగర్‌, తేతలి

No comments yet. Be the first to comment!
Add a comment
దాడికి మూల్యం చెల్లించక తప్పదు 
1
1/1

దాడికి మూల్యం చెల్లించక తప్పదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement