ఆలయ దర్శనంపై వినూత్న రీతిలో సర్వే
చోరీ సొత్తు స్వాధీనం
పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసి రూ.13.38 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఐదు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. 8లో u
ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించే భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు దేవదాయ శాఖ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్యూ ఆర్ కోడ్ల ద్వారా భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఇబ్బందులను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సోమవారం రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలోని ప్రొటోకాల్ కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తదితర ముఖ్యమైన ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్లను స్థానిక దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రధాన దేవాలయాలైన విజయవాడ, అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో సైతం ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి, ఆలయ దర్శనంపై సర్వే నిర్వహిస్తున్నారు.
అభిప్రాయాలు తెలిపేదిలా..
దర్శనానంతరం తమ అభిప్రాయాలను దేవదాయ శాఖకు తెలియజేయాలనుకునే భక్తులు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, అందులోని గూగుల్ లెన్స్‌తో ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఆ తరువాత ఆలయ దర్శనంపై సర్వే.. పేరుతో ఒక ఫాం ఓపెన్ అవుతుంది. అందులో మీ దర్శనం యొక్క అనుభవం ఎలా ఉంది? బాగుందా.. లేదా,.. దేవాలయాల్లో మౌలిక వసతులు, తాగునీరు, వాష్ రూమ్‌లు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు పెట్టే స్థలంపై మీ అభిప్రాయం? బాగుందా, లేదా.., దర్శనం మీరు భావించిన సమయంలో జరిగిందా, లేదాజ.. ప్రసాదం తాజాగా రుచిగా ఉందా, లేదా.. అనే అభిప్రాయాలను తెలిపి, భక్తుడి పూర్తి వివరాలను అందులో తెలియజేసి సబ్మిట్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment