ఏలూరు (టూటౌన్): ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలో అక్రమ కట్టడాల వ్యవహారంలో మున్సిపల్ ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఆర్జేడీ కార్యాలయం నుంచి వచ్చిన అధికారుల బృందం మంగళవారం నగరంలో తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న ఉద్యోగిపై పలు ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. బీ–ఫాం పట్టాలు ఉన్న స్థలాల్లో కూడా పక్కా భవనాలు కట్టుకునేందుకు అనుమతులు ఇవ్వడం, ఏలూరు కోర్టు సెంటర్లోని కొన్ని దుకాణాలకు అనుమతులు ఇవ్వడం, అశోక్ నగర్‌లోని కొన్ని కట్టడాలు, వన్‌టౌన్ ప్రాంతంలోని కొన్ని భవనాలను అధికారులు తనిఖీ చేశారు. బి.ఫారం పట్టాలు ఉన్న స్థలాల్లో కూడా పక్కా భవనాలు కట్టుకునేందుకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ అధికారులు సంబంధిత ఉద్యోగిపై ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనిఖీల్లో పలు అవకతవకలు బయటపడినట్లు తెలిసింది. కొంత మంది ఉద్యోగులు ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment